రూ.80 కోట్ల నిధులు సమీకరించిన క్లియర్ ట్యాక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ సేవలందిస్తున్న క్లియర్ ట్యాక్స్.. సిరీస్-ఏ రౌండ్‌లో భాగంగా రూ.80 కోట్ల నిధులను సమీకరించింది. సైఫ్ పార్టనర్స్ నుంచి ఈ పెట్టుబడులను సమీకరించామని.. వీటి సాయంతో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడంతో పాటు మరో 100 మంది ఇంజనీర్లను నియమించుకొని నాయకత్వ బృందాన్ని పటిష్ఠం చేస్తామని క్లియర్ ట్యాక్స్ వ్యవస్థాపక సీఈఓ అర్చిత్ గుప్తా మంగళవారమిక్కడ చెప్పారు. దేశంతో పాటు సిలిక్యాన్ వ్యాలీ నుంచి పలువురు టెక్ నిపుణులు ఇందులో ఉంటారని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారాయన. 2015-16లో 10 లక్షల మంది తమ ట్యాక్స్ రిటర్న్‌లను క్లియర్ ట్యాక్స్ ద్వారా ఫైల్ చేశారని, ఈ ఏడాది పూర్తయ్యేనాటికి ఈ సంఖ్యను 25 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అర్చిత్ వివరించారు.