
'రికార్డులు బద్దలు కొడుతున్నాయి'
ముంబయి : స్టాక్ మార్కెట్లు రికార్డులు బద్దలుకొడుతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లు తారాజువ్వలా దూసుకు పోతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం సరికొత్త ఆల్‌టైం రికార్డు నమోదైంది. లాభాల బాటలో పయనిస్తున్న సూచీల ఈ రోజు సరికొత్త ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకున్నాయి. సెన్సెక్ తొలిసారి 29 వేల మార్కును దాటింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ 8,700 మార్కు దాటింది. 130కి పైగా పాయింట్లలో సెన్సెక్స్, 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది.
కాగా 2016 వరకూ భారత వృద్ధికి ఢోకా లేదని ఐఎంఎఫ్ తాజా నివేదిక వెల్లడించడం కూడా స్టాక్ మార్కెట్ల జోరును మరింత పెంచింది.
ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు, కేంద్రం మరిన్ని సంస్కరణలు చేపట్టనుందన్న అంచనాలు, యూరోజోన్‌ను ఆదుకునేందుకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించవచ్చన్న ఆశలు, చైనా ఆర్థిక వృద్ధిరేటు క్షీణత అంచనాకంటే కాస్త మెరుగ్గానే ఉండటం వంటి అంశాలు బుల్‌ర్యాలీలో సూచీల పరుగు వేగాన్ని రెట్టింపు చేశాయి. మెటల్, ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.