ముంబయి : స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో రోజు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. తొలిసారిగా సెన్సెక్స్ 28,900 మార్క్ దాటగా, నిఫ్టీ కూడా 8,730 వద్ద ట్రేడ్ అవుతోంది.
విదేశీ నిధుల ప్రవాహం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత జోష్‌నివ్వటంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రం మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడుతుందన్న సానుకూల సంకేతాలతో పాటు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, భవిష్యత్ ఆర్జన అంచనాలు బాగా ఉండడం, రానున్న బడ్జెట్‌లో సంస్కరణలుంటాయనే అంచనాలు.... ఇవన్నీ స్టాక్ మార్కెట్ల జోరుకు ప్రధాన కారణాలని విశ్లేషకులంటున్నారు.