ఆల్ టైమ్ రికార్డు చేరువలో సెన్సెక్స్!
ఆల్ టైమ్ రికార్డు చేరువలో సెన్సెక్స్!
Published Wed, Mar 5 2014 4:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రత తగ్గడం, చైనా ఎకనామిక్ డేటా ప్రభావంతో సెన్సెక్స్ 67 పాయింట్లు లాభపడి 21276 పాయింట్ల వద్ద ముగిసింది. ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో సెన్సెక్స్ ముగియడం గమనార్హం. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6300 మార్కుపైనే క్లోజైంది. చివరకు 30 పాయింట్లు లాభపడి 6328 పాయింట్ల వద్ద ముగిసింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 6.29 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4.60, డీఎల్ఎఫ్ 3.50, ఐడీఎఫ్ సీ 3.22, ఏసీసీ 3 శాతం లాభపడ్డాయి.
టాటాపవర్ 3.25 శాతం, భారతీ ఎయిర్ టెల్, గెయిల్, కెయిర్న్ ఇండియా, హెచ్ సీఎల్ టెక్ స్వల్పంగా నష్టపోయాయి.
యూరప్ మార్కెట్లలో ఎఫ్ టీఎస్ ఈ 29, కాక్ 16, డాక్స్ 33 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
Advertisement