దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్ 150 పాయింట్ల లాభంతో మొదలైంది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్ 150 పాయింట్ల లాభంతో మొదలైంది. ఇక నిఫ్టీ 7,750 పాయింట్ల బెంచ్ మార్క్ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 25,366 పాయింట్లుతో, నిఫ్టీ 7,770 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఐటీసీ షేర్లు దూసుకు పోతున్నాయి.
మరోవైపు టాటా పవర్, బీపీసీఎల్ కంపెనీలు ఫలితాలను ఇవాళ వెల్లడించనున్నాయి. కాగా గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు(0.73%) క్షీణించి, 25,302 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65(0.83 శాతం) పాయింట్లు క్షీణించి 7,750 పాయింట్ల వద్ద ముగిశాయి. మరోవైపు రూపాయి కూడా 16 పైసలు లాభపడింది. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.67.25గా ఉంది.