బ్యాంకు షేర్ల జోరు: మార్కెట్లు పరుగులు
Published Thu, May 4 2017 3:59 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM
ముంబై :
నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ రికార్డు క్లోజింగ్ గురువారం స్టాక్ మార్కెట్లు భారీలాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.41 పాయింట్ల లాభంలో 30,126.21 వద్ద, నిఫ్టీ 47.95 పాయింట్ల లాభంలో 9359.50 వద్ద క్లోజైంది. ఫలితాల ప్రకటనాంతరం ఐసీఐసీఐ బ్యాంకు 9 శాతం ర్యాలీ జరిపింది. అంతేకాక ఇతర బ్యాంకు షేర్లకు జోష్ ఇస్తూ బ్యాంకులకు గుదిబండగా ఉన్న మొండి బకాయిల(ఎన్‌పిఎ) సమస్య పరిష్కారం కోసం ఆర్డినెన్స్ తేవాలని కేంద్ర ప్రభుత‍్వం నిర్ణయించడం ఈ సెక్టార్ లో మంచి ఊపునిచ్చింది. కొత్త ఎన్పీఏ పాలసీ అంచనాలతో దాదాపు బ్యాంకు షేర్లన్నీ నేడు లాభాల్లో ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు కూడా పరుగులు పెట్టాయి.
ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికేట్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్లు లాభాలు పండించాయి. టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హిందాల్కో, బీపీసీఎల్ నేటి ట్రేడింగ్ లో టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు బలహీనపడి 64.19 వద్ద ముగిసింది. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 295 రూపాయల మేర నష్టపోయి 28,177గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement