సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతోకొనసాగుతోంది. ఈ ఏడాది వర్షపాత అంచనాలు నిరాశపరచడంతో బుధవారం బలహీన పడిన స్టాక్‌మార్కెట్లు ఆర్‌బీఐ నేడు (గురువారం) ప్రకటించిన రేట్ కట్‌తో నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఊగిసలాట ధోరణిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయిట్లు క్షీణించి 38758 వద్ద,నిఫ్టీ 37 పాయింట్లు బలహీనంతో 11609వద్ద కొనసాగుతోంది.
ప్రధానంగా ఐటీ, మెటల్, బ్యాంకు నష్టపోతుండగా, రియల్టీ, ఆటో, ఫార్మా లాభపడుతున్నాయి. ఐబీ హౌసింగ్, హీరో మోటో, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, బ్రిటానియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టైటన్ లాభనపడుతున్నాయి. మరోవైపు రిలయన్స ఇండస్ట్రీస్, టీసీఎస్,ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, యస్ బ్యాంక్, హిందాల్కో, బీపీసీఎల్, గెయిల్, యూపీఎల్, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్ నష్టపోతున్నాయి. ఎయిర్‌లైన్స్ షేర్లు లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ట్రేడ్ అవుతోంది.
కాగా అంచనాలకనుగుణంగానే ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 0.25 శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు ఏడాది తరువాత 6 శాతానికి దిగివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment