
సాక్షి, ముంబై: భారీ అమ్మకాలతో దలాల్ స్ట్రీట్‌ఢమాల్ అంది. ఆరంభంలోనే సెన్సెక్స్ 600 పాయింట్లు కుప్పకూలింది. నిఫ్టీ 167 పాయింట్లు క్షీణించింది. తీవ్ర ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 469 పాయింట్ల నష్టంతో 35, 506 వద్ద,నిఫ్టీ 143 పాయింట్లు క్షీణించి 10,714 వద్ద కొనసాగుతోంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. ప్రధానంగా రియాల్టీ టాప్ లూజర్‌గా ఉంది . ఐషర్ మోటార్స్, రిలయన్స్, టీసీఎస్, హీరో మోటో, గెయిల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోతుండగా, ఎల్ అండ్ టీ , హిందాల్కో, జేఎస్‌యూ డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ లాభపడుతున్నాయి.
అంతర్జాతీయ చమురు ధరలపెరుగుదల, అటు డాలరుతో మారకంలో రూపాయి బుధవారం చారిత్రక కనిష్టానికి పతనంకాగా.. గురువారం మరింత పతనమైంది. 73.70 వద్ద మరో కనిష్టాన్ని తాకింది. రుపీ, చమురు ధరల సెగతో స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు పడిపోయి 35,976 వద్ద నిలవగా.. నిఫ్టీ 150 పాయింట్లు పతనమై 10,858 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.