ముంబై : బ్లాక్ మండే మిగిల్చిన నష్టాల నుంచి స్టాక్‌మార్కెట్లు బుధవారం ఆరంభంలో కోలుకున్నా మళ్లీ ఒడిదుడుకలతో సాగుతున్నాయి. ముడిచమురు ధరలు పుంజుకోవడంతో మదుపరులు కొనుగోళ్లకు దిగినా కరోనా వైరస్ భయాలు వెన్నాడుతున్నాయి. ఇక ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఉద్దీపన ప్యాకేజ్‌లు ప్రకటిస్తారనే అంచనాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. రిలయన్స్ ఇండస్ర్టీస్, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 35,566 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 36 పాయింట్ల నష్టంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,414 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment