
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాలకు చెక్ పెడుతూ వారంతంలో బలహీనంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల నేపథ్యంలో దేశీయంగా అన్ని రంగాలలోనూ ఇన్వెస్టర్ల అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో కీలక సూచీలు పతనం బాట పట్టాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయి 35,826 కి చేరగా, నిఫ్టీ సైతం 184 పాయింట్లు కోల్పోయి 10,767 స్థాయికి చేరింది.
ప్రయివేటు బ్యాంక్స్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో ఇలా అన్నిరంగాలూ నష్టపోతున్నాయి. ఐవోసీ 5.5శాతం నష్టపోయింది. ఇంకా రిలయన్స్, ఇన్ఫోసీస్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, డా.రెడ్డీస్ యూపీఎల్, ఇన్‌ఫ్రాటెల్, మారుతీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, జీ, టైటన్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అయితే టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.
అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా నష్టాల్లోకి జారుకుంది. డాలరు మారకంలో 55పైసలు నష్టపోయి 70.25 వద్ద ఉంది