రూ. 499కే స్పైస్‌జెట్ విమానయానం | SpiceJet Tickets Go on Sale From Rs 499 | Sakshi
Sakshi News home page

రూ. 499కే స్పైస్‌జెట్ విమానయానం

Published Tue, Sep 2 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

రూ. 499కే స్పైస్‌జెట్ విమానయానం

రూ. 499కే స్పైస్‌జెట్ విమానయానం

- ఒక్క రోజులోనే లక్ష టికెట్‌లు బుక్
- రేపు ముగియనున్న ఆఫర్
ముంబై: స్పైస్‌జెట్ అందిస్తున్న రూ.499కే విమానయాన ఆఫర్‌కు మొదటి రోజే అనూహ్యమైన స్పందన లభించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకే లక్ష టికెట్‌లు బుక్ అయ్యాయి. ఒక్క రోజులోనే ఇన్ని టికెట్‌లు బుక్ కావడం రికార్డని సమాచారం. ఈ సంస్థ రెండు రోజులకొక ఆఫర్‌ను అందిస్తోంది. తాజాగా  ఎర్లీ బర్డ్ పేరుతో రూ.499కే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రూ.499(ఇంధన సర్‌చార్జీతో కలిపి, వర్తించే పన్నులు, ఫీజులు అదనం) ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని స్పైస్‌జెట్ సోమవారం తెలిపింది.

బుకింగ్స్ బుధవారం ముగుస్తాయని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ ఆవిలి పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి అక్టోబర్ 24 మధ్య ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించారు. తమ దేశీయ నెట్‌వర్క్‌లోని డెరైక్ట్, కనెక్టింగ్, వయా విమానాలకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. స్పైస్‌జెట్ విమానయాన సంస్థ 41 భారతీయ, 8 విదేశీ నగరాలకు 340 డైలీ విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement