
విశాఖ, విజయవాడ నుంచి మరిన్ని స్పైస్ జెట్ సర్వీసులు
ముంబై: వేసవి సీజన్ సందర్భంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మూడు కొత్త రూట్లలో సర్వీసులు ప్రారంభించింది. అలాగే ఆరు రూట్లలో సర్వీసులు పెంచింది. కొత్తగా ప్రవేశపెట్టిన వాటిలో తిరుపతి-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ముంబై-ఉదయ్‌పూర్ రూట్లు ఉన్నాయి. మరోవైపు సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచిన వాటిల్లో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-విశాఖపట్నం, ఢిల్లీ-ధర్మశాల, ఢిల్లీ-శ్రీనగర్ రూట్లు ఉన్నాయి. కంపెనీ ఇటీవలే ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి తిరుపతికి సర్వీసులు ప్రారంభించింది. తాజాగా హైదరాబాద్-చెన్నై రూట్లో నాలుగో నాన్-స్టాప్ ఫ్లయిట్, హైదరాబాద్-బెంగళూరు మధ్య నాలుగో డెరైక్ట్ ఫ్లయిట్, ఢిల్లీ-శ్రీనగర్ రూట్లో రెండో నాన్ స్టాప్ ఫ్లయిట్ ప్రారంభించినట్లవుతుంది.