
స్టాక్ మార్కెట్‌కు కరోనా షాక్
ముంబై : కరోనా వైరస్ వ్యాప్తి అంచనాలతో స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. పలు దేశాలకు ఈ డెడ్లీ వైరస్ వ్యాప్తి చెందిందన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇన్వెస్టర్లు యధేచ్చగా అమ్మకాలకు దిగడంతో అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. మెటల్, ఫార్మా, పీఎస్‌యూ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 806 పాయింట్ల నష్టంతో 40.363 పాయింట్ల వద్ద ముగియగా, 251 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,869 పాయింట్ల వద్ద క్లోజయింది.