
రివైటల్ హెచ్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ధోని
ఫార్మా రంగ దిగ్గజ కంపెనీ సన్‌ఫార్మాకు చెందిన హెల్త్ సప్లిమెంట్ బ్రాండ్ ‘రివైటల్ హెచ్’కు ఇక నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం ఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
న్యూఢిల్లీ: ఫార్మా రంగ దిగ్గజ కంపెనీ సన్‌ఫార్మాకు చెందిన హెల్త్ సప్లిమెంట్ బ్రాండ్ ‘రివైటల్ హెచ్’కు ఇక నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం ఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. రివైటల్ హెచ్ బ్రాండ్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని కొనసాగుతారని సన్‌ఫార్మా గ్లోబల్ హెల్త్‌కేర్ బిజినెస్ ప్రకటించింది. రివైటల్ హెచ్ బ్రాండ్‌కు దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో డిమాండ్ ఉందని, ఇక పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదలకు ధోని భాగస్వామ్యం దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. భారతీయుల దైనందిన జీవితంలో రివైటల్ హెచ్ ఒక భాగంగా మారుతుందని ధోని ఆకాంక్షించారు. రివైటల్ హెచ్‌కు ఇదివరకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.