సన్‌ఫార్మా చేతికి నోవార్టిస్‌ క్యాన్సర్‌ ఔషధం | Sun Pharma to acquire Novartis's cancer drug Odomzo for $175 mn | Sakshi
Sakshi News home page

సన్‌ఫార్మా చేతికి నోవార్టిస్‌ క్యాన్సర్‌ ఔషధం

Published Fri, Dec 23 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

సన్‌ఫార్మా చేతికి నోవార్టిస్‌ క్యాన్సర్‌ ఔషధం

సన్‌ఫార్మా చేతికి నోవార్టిస్‌ క్యాన్సర్‌ ఔషధం

ఒప్పందం విలువ 17.5 కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: నొవార్టిస్‌కు చెందిన క్యాన్సర్‌ ఔషధాన్ని ప్రముఖ ఫార్మా కంపెనీ సన్‌ ఫార్మా కొనుగోలు చేస్తోంది. నొవార్టిస్‌కు చెందిన ఒడొమ్‌జో అనే క్యాన్సర్‌ ఔషధాన్ని 17.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నామని సన్‌ ఫార్మా తెలిపింది. దీనికి సంబంధించిన తమ, తమ అనుబంధ కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని పేర్కొంది.

ఈ ఔషధం కొనుగోలుతో తమ బ్రాండెడ్‌ క్యాన్సర్‌ ఔషధాల పోర్ట్‌ఫోలియో మరింతగా విస్తరిస్తుందని సన్‌ఫార్మా గ్లోబల్‌ హెడ్‌ (బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) కీర్తి గనోర్కర్‌ తెలిపారు. ఈ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఈ ఏడాది జూలైలో ఆమోదం లభించింది. ఈ ఔషద కొనుగోలు వార్త నేపథ్యంలో బీఎస్‌ఈలో సన్‌ ఫార్మా షేర్‌ ఇంట్రాడేలో రూ.625 గరిష్ట స్థాయిని తాకి, చివరకు 0.8 శాతం నష్టంతో రూ.609 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement