
కంపెనీల పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాల వల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.63 శాతానికి పెరగనుంది. 2017–18 బడ్జెట్ ప్రకారం పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లుగా తేలింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.76,857.70 కోట్ల విలువైన పన్ను ప్రోత్సాహకాలను అందించారు. ఈ మొత్తంతో పోల్చితే ఈసారి భారం 8.63 శాతానికి పెరిగింది.