న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక అత్యున్నత కమిటీ(హెచ్‌ఎల్‌సీ)ని నియమించింది. పన్ను సంబంధిత సమస్యలపై వాణిజ్య, పరిశ్రమ ప్రతినిధులతో సంప్రదింపులు జరపే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి ఆర్థిక శాఖ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అశోక్ లాహిరి నేతృత్వం వహిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కమిటీలో మరో ఇద్దరు సభ్యులు ఉంటారని పేర్కొంది. సెటిల్‌మెంట్ కమిషన్ (ఇన్‌కం ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్) రిటైర్డ్ సభ్యుడు, సిద్ధార్థ ప్రధాన్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ రిటైర్డ్ డీజీ(ఆడిట్) గౌతమ్ రేలు ఆ ఇద్దరు సభ్యులని వివరించింది.
ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డ్(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్-సీబీడీటీ), ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్రీయ బోర్డు(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్-సీబీఈసీ)లు కోరిన పన్ను సంబంధిత అంశాలపై ఈ కమిటీ తగిన సూచనలందజేస్తుంది. ఈ సూచనలు ఆధారంగా సీబీడీటీ, సీబీఈసీలు రెండు నెలల్లో సర్క్యులర్లు, వివరణలను ఇస్తాయి. వొడాఫోన్, నోకియా, షెల్ వంటి బహుళ జాతి సంస్థలతో కేంద్రం పన్ను వివాదాలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు.
యప్‌టీవీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా జాన్సన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ టీవీ సంస్థ యప్‌టీవీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం) డామన్ ఎస్ జాన్సన్ నియమితులయ్యారు. వ్యాపారాభివృద్ధికి తోడ్పడేలా వివిధ సంస్థలతో కలిసి పనిచేయడం, కంటెంట్ రూపకల్పన మొదలైన వి ఆయన బాధ్యతలుగా ఉంటాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు డిజిటల్ రంగంలో అనుభవం ఉన్న జాన్సన్.. ఇంతకు ముందు సోనీకి చెందిన ప్లేస్టేషన్‌లో పనిచేశారు. అక్కడ ఓవర్ ది టాప్ ఎంటర్నెట్ ప్లాట్‌ఫాం రూపకల్పనకు తోడ్పడినట్లు యప్‌టీవీ వ్యవస్థాపక సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. కొత్త మార్కెట్లలో ప్రవేశించేందుకు జాన్సన్ అనుభవం తోడ్పడగలదన్నారు.
సిండికేట్ బ్యాంక్ రూ. 750 కోట్ల నిధుల సేకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిండికేట్ బ్యాంక్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రూ. 750 కోట్ల టైర్-2 మూలధనాన్ని సేకరించింది. బాసెల్3 నిబంధనలను చేరుకోవడానికి 10 ఏళ్ల నాన్ కన్వర్టబుల్ రీడీమబుల్ బాండ్స్‌ను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు సిండికేట్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 8.95 శాతం వడ్డీరేటుపైన ఈ బాండ్స్‌ను జారీ చేసింది. డిసెంబర్1న ముగిసిన ఈ ఇష్యూకి ఇక్రా, కేర్ రేటింగ్ సంస్థలు ఏఏప్లస్ రేటింగ్ ఇచ్చాయి.
పన్ను సమస్యలపై అత్యున్నత స్థాయి కమిటీ
Published Thu, Dec 4 2014 12:10 AM | Last Updated on Thu, Sep 27 2018 4:22 PM
Advertisement