టాప్‌ 3 ఐటీ బ్రాండ్స్‌లో టీసీఎస్‌... | 'TCS among one of Top 3 global brands in IT services' | Sakshi
Sakshi News home page

టాప్‌ 3 ఐటీ బ్రాండ్స్‌లో టీసీఎస్‌...

Published Fri, Feb 24 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

టాప్‌ 3 ఐటీ బ్రాండ్స్‌లో టీసీఎస్‌...

టాప్‌ 3 ఐటీ బ్రాండ్స్‌లో టీసీఎస్‌...

లండన్‌: దేశీ సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తాజాగా టాప్‌ 3 అంతర్జాతీయ ఐటీ దిగ్గజ బ్రాండ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ బ్రాండ్‌ వేల్యుయేషన్‌ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌ తమకు ఈ ర్యాంకింగ్‌ ఇచ్చినట్లు టీసీఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యుత్తమ పనితీరుకు గాను తమకు ఎఎప్లస్‌ రేటింగ్‌ దక్కినట్లు పేర్కొంది.

అయిదేళ్ల క్రితం టీసీఎస్‌ .. బిగ్‌ 4 బ్రాండ్స్‌లో ఒకటిగా నిలవగా తాజాగా మరో మెట్టు ఎదిగి టాప్‌ 3లో చోటు దక్కించుకుందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ సీఈవో డేవిడ్‌ హేగ్‌ తెలిపారు. తొలి రెండు స్థానాల్లో ఐబీఎం, యాక్సెంచర్‌ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement