టెల్కోలకు ట్రాయ్‌ షాక్‌..! | Trai lowers call connect charge to 6 paise, no rate from 2020 | Sakshi
Sakshi News home page

టెల్కోలకు ట్రాయ్‌ షాక్‌..!

Published Wed, Sep 20 2017 12:57 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

టెల్కోలకు ట్రాయ్‌ షాక్‌..!

టెల్కోలకు ట్రాయ్‌ షాక్‌..!

► కాల్‌ కనెక్ట్‌ చార్జీ నిమిషానికి 6 పైసలకు తగ్గింపు
► ప్రస్తుతం అది 14 పైసలు


న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ మరోసారి భారీ సంస్కరణకు తెరతీసింది. మొబైల్‌ నుంచి మొబైల్‌కు వెళ్లే కాల్స్‌పై టర్మినేషన్‌ చార్జీ/ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీని భారీగా తగ్గిస్తూ ప్రధాన ఆపరేటర్లకు ట్రాయ్‌ షాకిచ్చింది. కాల్‌ టర్మినేషన్‌ చార్జీ ప్రస్తుతం నిమిషానికి 14 పైసలు ఉండగా, దీన్ని 6 పైసలకు తగ్గించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని ట్రాయ్‌ తెలిపింది. 2020 జనవరి 1 నుంచి ఈ చార్జీని పూర్తిగా ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా ఈ సవరణ ఉన్నట్టు వివరించింది. ఇక, ల్యాండ్‌లైన్, మొబైల్‌ నెట్‌వర్క్‌ల మధ్య కాల్స్‌పై చార్జీ ఉండదని స్పష్టం చేసింది.

టర్మినేషన్‌ చార్జీ అన్నది ఒక నెట్‌ వర్క్‌ నుంచి వచ్చిన కాల్‌కు తన నెట్‌వర్క్‌ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది. ఉదాహరణకు జియో నుంచి ఐడియా కస్టమర్‌కు కాల్‌ వెళితే... అప్పుడు జియో ఐడియాకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్‌ తాజా నిర్ణయం జియోకు అనుకూలంగా ఉండగా... ప్రధాన టెలికం ఆపరేటర్ల డిమాండ్లకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతమున్న నిమిషానికి 14 పైసల చార్జీతో భారీగా నష్టపోతున్నామని ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.

దీన్ని కనీసం 30–35 పైసలుగా నిర్ణయించాలని కోరుతున్నాయి. ఎయిర్‌టెల్‌ అయితే ఐయూసీని తక్కువగా నిర్ణయించడం వల్ల గత ఐదేళ్ల కాలంలో రూ.6,800 కోట్ల మేర నష్టపోయినట్టు ఇటీవలే పేర్కొంది. ఈ చార్జీని తగ్గించని కోరుతూ వొడాఫోన్‌ గ్రూపు సీఈవో విట్టోరియో కొలావో కేం్రద్రానికి లేఖ కూడా రాశారు. మరోవైపు జియో, ఇతర చిన్న ఆపరేటర్లు మాత్రం ఐయూసీని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇది వినియోగదారులకే లాభమన్నది వీటి వాదన.

ట్రాయ్‌ నిర్ణయం ఘోరం:సీవోఏఐ
ఐయూసీని తగ్గించడంపట్ల సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) సీరియస్‌గా స్పందించింది.  టాయ్‌ నిర్ణయం దారుణమని. దీని పరిష్కారం కోసం కోర్టును వెళ్తామని సభ్యులు సంకేతమిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement