బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈకేవైసీ | Trai suggests Aadhaar as eKYC for Internet, broadband connections | Sakshi
Sakshi News home page

బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈకేవైసీ

Published Thu, May 18 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈకేవైసీ

బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈకేవైసీ

న్యూఢిల్లీ: మొబైల్‌ కనెక్షన్లకు అమల్లో ఉన్న ఆధార్‌ ఈకేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను ఫిక్స్‌డ్‌లైన్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లకూ అమలు చేయాలని ట్రాయ్‌ సిఫారసు చేసింది. ట్రాయ్‌ సూచనను టెలికం శాఖ ఆమోదిస్తే గుర్తింపు ప్రక్రియ మరింత వేగం, విశ్వసనీయతను సంతరించుకుంటుందని, దీనివల్ల పరిశ్రమకు వ్యయాలూ భారీగా ఆదా అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ఆధార్‌ ఈకేవైసీ విధానాన్ని ఇంటర్నెట్, బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లకూ అమల్లోకి తీసుకురావాలని కోరుతూ ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్ల సంఘం (ఐఎస్‌పీఏఐ) ట్రాయ్‌కు ఓ ప్రతిపాదన సమర్పించింది. ఆధార్‌ ఈ కేవైసీని ఇంటర్నెట్‌ కనెక్షన్లకూ అమలు చేయడం వల్ల వేగం, విశ్వసనీయ పెరుగుతాయని, సమయం, వ్యయాలు ఆదా అవుతాయని ఐఎస్‌పీఏఐ పేర్కొన్నట్టు ట్రాయ్‌ వెల్లడించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement