సిక్కా ఆ విషయంలో పక్కా.... | Vishal Sikka updates Twitter bio, posts e-mail on personal blog | Sakshi
Sakshi News home page

సిక్కా ఆ విషయంలో పక్కా....

Published Fri, Aug 18 2017 4:49 PM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

సిక్కా ఆ విషయంలో పక్కా....

సిక్కా ఆ విషయంలో పక్కా....

సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈవోగా వైదొలగి పెను ప్రకంపనలు సృష్టించిన విశాల్‌ సిక్కా కంపెనీలో తన కళ్లెదుటే ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నా నిబ్బరంగా వ్యవహరించారు. ఇంత ఒత్తిడిలోనూ ఈ టెక్నోక్రాట్‌ కాస్త సమయం తీసుకని ట్విట్టర్‌లో తన హోదాను అప్‌డేట్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

రెండు లక్షల పైచిలుకు ఫాలోయర్లు కలిగిన తన ట్విట్టర్‌ ఖాతా ప్రొఫైల్‌లో ఎక్స్‌ సీఈవో ఇన్ఫోసిస్‌ అని అప్‌డేట్‌ చేశారు. ఇన్ఫోసిస్‌కు వీడ్కోలు పలకడం దిగ్ర్భాంతికి గురిచేసిందన్న ఫాలోయర్‌ దెబజాన్‌ మెహంతికి సిక్కా రిప్లయి కూడా ఇచ్చారు. అంతటితో ఆయన ఊరుకోలేదు. తన వ్యక్తిగత బ్లాగ్‌లో రాజీనామాకు దారితీసిన పరిస్థితులను సవివరంగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement