
సాక్షి, న్యూఢిల్లీ: వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వీ7'ను సోమవారం విడుదల చేసింది. వీ7ప్లస్ తరహాలోనే రూపొందించిన దీని ధరను రూ.18,990 గా నిర్ణయించింది. హై మెగా పిక్సెల్ కెమెరాలకు పేరొందిన వివో తాజా స్మార్ట్‌ఫోన్ కూడా భారీ సెల్ఫీ కెమెరాను అమర్చింది. ప్రత్యేకంగా వివో స్టోర్లలోగానీ, ఫ్లిప్‌కార్ట్ ద్వారాగానీ ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. నవంబరు 24నుంచి విక్రయానికి లభ్యం కానుంది.
వివో వీ7 ఫీచర్లు
5.7 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్,
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
4 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
