సాక్షి, ముంబై : వొడాఫోన్ ఐడియా కూడా ప్రతీ రీచార్జ్ పై కమిషన్ అందించే పథకాన్ని లాంచ్ చేసింది. కరోనా, లాక్ డౌన్ ఇబ్బందుల్లో ఉన్నతమ కస్టమర్ల సౌలభ్యం కోసం “రీఛార్జ్ ఫర్ గుడ్” పేరుతో లాంచ్ చేసిన పథకంలో ఇతర ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆన్‌లైన్ రీచార్జ్ చేస్తే కమిషన్ అందివ్వనుంది. వొడాఫోన్ ఐడియా, వొడాఫోన్ లేదా ఐడియా కస్టమర్లు వేరేవారికి చేసిన రీచార్జిపై ఏకంగా 6 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉందని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇది ప్రతి వొడాఫోన్, ఐడియా కస్టమర్లకు వర్తిసుందని, స్నేహితుడు, కుటుంబం లేదా ఆన్‌లైన్ రీఛార్జ్ ఎలాగో తెలియని లేదా ఇంటర్నెట్‌కు ప్రాప్యత లేని ఎవరికైనా రీఛార్జ్ చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. (జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్)
మై వొడాఫోన్, మై ఐడియా యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేయాల్సి వుంటుంది. వీటి ద్వారా వొడాఫోన్ ఐడియా,ఐడియా వినియోగదారులకు రీచార్జ్ చేస్తే 6 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఇందుకు ఎలాంటి
రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే రీచార్జ్ చేసిన 96 గంటల్లో వినియోగదారుల ఖాతాకు క్యాష బ్యాక్ జమ అవుతుంది. ప్రస్తుత ప్రీపెయిడ్ కస్టమర్ మైవోడాఫోన్ యాప్ లేదా మైఇడియా అనువర్తనానికి లాగిన్ అవ్వాలి. అనంతరం వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్ కోసం రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. దీని తరువాత, రీఛార్జ్ చేస్తున్న కస్టమర్ రీఛార్జ్ విలువను బట్టి క్యాష్‌బ్యాక్ పొందుతారు. అలాగే తదుపరి రీఛార్జిపై క్యాష్‌బ్యాక్ కూపన్‌ను వాడుకోవచ్చని కంపెనీ ఒక ప్రకనటనలో తెలిపింది. జియో 4.16 శాతం కమిషన్ అందుస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment