
బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి తోడ్పడాలి
బ్రిక్స్ కూటమి దేశాల మధ్య పరస్పర సహకారం మరింతగా పెంపొందేలా బిజినెస్ కౌన్సిల్,
బిజినెస్ కౌన్సిల్, ఎన్‌డీబీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచన
జియామెన్ (చైనా): బ్రిక్స్ కూటమి దేశాల మధ్య పరస్పర సహకారం మరింతగా పెంపొందేలా బిజినెస్ కౌన్సిల్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) కృషి చేయాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సూచించారు. తొమ్మిదో బ్రిక్స్ సదస్సు సందర్భంగా.. కౌన్సిల్, ఎన్‌డీబీ విజయాలను ప్రశంసించారు.
ఈ–కామర్స్, సాంకేతికాభివృద్ధి, ప్రమాణాలు నెలకొల్పడం మొదలైన అంశాల్లో బిజినెస్ కొన్సిల్ ఎంతగానో కృషి చేసిందని పేర్కొన్నారు. మరోవైపు ఆఫ్రికాలో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించడం ద్వారా ఎన్‌డీబీ కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు జిన్‌పింగ్ వివరించారు. రాబోయే ‘స్వర్ణ దశాబ్ది’లో పరస్పర సహకారం మరింతగా పెంచుకోవాలని బ్రిక్స్ దేశాధినేతలు తీర్మానించిన నేపథ్యంలో బిజినెస్ కౌన్సిల్, ఎన్‌డీబీ ఈ దిశగా తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్‌డీబీ ప్రెసిడెంట్ కేవీ కామత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.