హైదరాబాద్లో జెడ్ఎఫ్ టెక్నాలజీ కేంద్రం! | ZF Freed ricsaven company international company in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో జెడ్ఎఫ్ టెక్నాలజీ కేంద్రం!

Sep 9 2016 12:55 AM | Updated on Aug 15 2018 7:56 PM

హైదరాబాద్లో జెడ్ఎఫ్ టెక్నాలజీ కేంద్రం! - Sakshi

హైదరాబాద్లో జెడ్ఎఫ్ టెక్నాలజీ కేంద్రం!

భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ కంపెనీ అడుగుపెట్టింది.

20-30 మిలియన్ యూరోల పెట్టుబడి
2017 జనవరిలో ప్రారంభం
2020 నాటికి 2,500 మందికి ఉపాధి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ కంపెనీ అడుగుపెట్టింది. జర్మనీకి చెందిన కార్ల విడిభాగాల తయారీ సంస్థ జెడ్‌ఎఫ్ ఫ్రీడ్‌రిచ్‌షవెన్ సంస్థ దేశంలో తొలి టెక్నాలజీ సెంటర్‌ను (ఐటీసీ) గచ్చిబౌలిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారమిక్కడ తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు, జెడ్‌ఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ సురేష్ కేవీ, వైస్ ప్రెసిడెంట్ (ఆర్‌అండ్‌డీ) డాక్టర్ ఎక్కార్ట్ వోన్ వెస్టర్‌హాల్ట్, ఇండియా టెక్నాలజీ సెంటర్ (ఐటీసీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మమతా చామర్తి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కొన్నేళ్లుగా జెడ్‌ఎఫ్ భారత అవసరాలకు తగ్గట్టుగా విడిభాగాలను స్థానికీకరిస్తోందని, భారత్‌లోని టాలెంట్‌ను ఆకర్షించడానికి ఈ కేంద్రం కీలకమని ఈ సందర్భంగా జెడ్‌ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. ఇక్కడి నుంచి టెక్నాలజీ సొల్యూషన్లను వివిధ దేశాలతో పాటు స్థానిక కంపెనీలకూ అందిస్తామన్నారు. విలేకరులతో మమతా చామర్తి మాట్లాడుతూ... 20-30 మిలియన్ యూరోల పెట్టుబడితో (దాదాపు రూ.150- 200 కోట్లు) ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సెంటర్ నుంచి అంతర్జాతీయంగా ఉన్న ఇతర జెడ్‌ఎఫ్ డెవలప్‌మెంట్ సెంటర్లకు ఐటీ సహకారాన్ని అందించేలా అభివృద్ధి చేస్తామని చెప్పారామె. ‘‘ఈ కేంద్రంలో 2020 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ప్రస్తుతం ఇందులోని 1,000 మంది ఉద్యోగులు టీసీఎస్, టెక్ మహీంద్రాలో ఆన్‌సైట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు’’ అని తెలియజేశారు. ప్రస్తుతానికైతే గచ్చిబౌలిలో స్థలాన్ని లీజుకు తీసుకున్నామని.. త్వరలో సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారామె. మూడు దశాబ్ధాలకు పైగా దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెడ్‌ఎఫ్ గ్రూప్‌కు దేశంలో 26 ప్లాంట్లలో 12 వేల మంది ఉద్యోగులున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 టెక్నాలజీ సెంటర్లున్నాయి. 40 దేశాల్లో 230 ప్రాంతాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులున్నారు. 2015లో కంపెనీ అమ్మకాలు 29.2 బిలియన్ యూరోలని కంపెనీ నివేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement