వయనాడ్ : తరగతి గదిలో పాము కాటుకు గురై ఓ విద్యార్థిని ప్రాణాలు వదిలిన ఘటన కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వయనాడ్ జిల్లాకు చెందిన ఎస్ షెహాలా(10), సుల్తాన్ బాథరీ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లిన షెహాలా.. తరగతి గదిలో ఉన్న రంధ్రంలో కాలు పెట్టగా.. పాము కాటేసింది. కాలుపై ఉన్నరక్తపు మరకలు గమనించిన తరగతి టీచర్.. రాయి తగిలిందని చెప్పి బ్యాండేజ్ వేసి క్లాస్‌లోనే కూర్చోపెట్టారు. కొద్దిసేపటి తర్వాత బాలిక కళ్లు మూసుకుపోవడంతో ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు.
ఎస్ షెహాలా(ఫైల్ ఫోటో)
పాఠశాలకు చేరుకున్న బాలిక తండ్రి.. ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గవర్నమెంట్ తాలుకా హాస్పిటల్‌కు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో.. కోజికోడ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్చుకోలేదు. చివరకు ఆ బాలిక వయనాడ్ జిల్లాలోని వైథిరిలో ఉన్న ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
తరగతిగదిలోని రంద్రం
కాగా, పాము కాటుకు గురైన షెహాలాకు చికిత్స అందించడానికి స్కూల్ యాజమాన్యం తటపటాయించిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తరగతి టీచర్‌ను సస్పెండ్ చేసిన కేరళ ప్రభుత్వ.. పూర్తి విచారణ చెపట్టాలని అధికారులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment