
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక
రాయ్‌గడ్ : మధ్యప్రదేశ్‌లో మరో మానవమృగం రెచ్చిపోయింది. తన కోరిక తీర్చలేదని ఓ దుర్మార్గుడు బాలికకు నిప్పు పెట్టాడు. వివారాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాయ్‌గడ్‌లోని సుస్తానీ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి దండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయాన్ని అదునుగా చేసుకున్న యువకుడు ఇంట్లోకి ప్రవేశించి లైంగిక వేధింపులకు గురిచేశాడు.
అయితే బాలిక ఆ ప్రయత్నాన్ని అడ్డుకొనే ప్రయత్నంలో యువకుడికి ఎదురు తిరిగింది. అంతే ఆ కామాంధుడులోని మృగం నిద్రలేచింది. తనను అడ్డుకుందనే నెపంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాలిక కేకలతో చుట్టుపక్కల వారు రావడంతో అక్కడ నుంచి యువకుడు పారిపోయాడు. హుటా హుటిన బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మంటల్లో బాలిక శరీరం 50 శాతం కాలిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జిల్లా పోలీస్ ఉన్నాతాధికారి శిమల ప్రసాద్ తెలిపారు. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment