
ప్రతీకాత్మక చిత్రం
సుమారు 19 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారని
మనీలా : వరుస బాంబు పేలుళ్లతో ఫిలిప్పిన్స్‌లోని జోలో ఐలాండ్ దద్దరిల్లింది. ఆదివారం దక్షిణ ఫిలిప్పిన్, ఐలాండ్‌లోని రోమన్ కాథోలిక్ చర్చి సమీపంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ఘటనలో సుమారు 19 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసి సహాయక చర్యలు చేపట్టారు. చర్చిలోపల తొలి బాంబు పేలుడు జరగ్గా.. రెండోది కాంపౌండ్ బయట చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.