హోటల్‌లో యువతిపై అఘాయిత్యం | 24 years Women Molested By Cousin In Hotel Room In Haryana | Sakshi
Sakshi News home page

యువతిపై సమీప బంధువు అఘాయిత్యం

Published Mon, Nov 11 2019 12:27 PM | Last Updated on Mon, Nov 11 2019 12:50 PM

24 years Women Molested By Cousin In Hotel Room In Haryana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్ : పరీక్ష రాయడానికి వేరే ప్రాంతానికి వచ్చిన యువతిపై సమీప బంధువు దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యువతి నిద్రిస్తున్న సమయంలో ఆమెపై లైంగి​క దాడికి చేశాడు. సెప్టెంబర్‌ 22న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హరియాణాలోని మహేంద్రగడ్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువతి పరీక్షల నిమిత్తం గురుగ్రామ్‌ ప్రాంతానికి వచ్చింది. పరీక్ష హల్‌ వద్దకు వచ్చిన సమీప బంధువు ఒకరు యువతికి మాయమాటలు చెప్పి  గురుగ్రామ్‌ బస్టాండ్‌ సమీపంలోని హోటల్‌కు తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో హోటల్‌లో రాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న సదరు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో భయానికి గురైన యువతి మరునాడు పరీక్ష రాసి నోరు మెదపకుండా తన ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఎన్నో రోజుల మనోవేదన అనుభవించిన యువతి చివరికి తల్లిందండ్రులకు జరిగిన విషయమంతా చెప్పడంతో వారు సమీపంలోని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఈ కేసును గురుగ్రామ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు ప్రారం‍భించామని, నిందితుడిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement