
సాక్షి, వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గంగాదేవిపల్లి సమీపంలో సంభవించింది. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన యువకులు గంగాదేవిపల్లికి చెందిన ఇట్ల జగదీష్(19), న్యాల నవీన్(20), జనగామ జిల్లా నర్మెట్ట మాన్‌సింగ్ తండాకు చెందిన లకావత్ గణేష్(21)గా గుర్తించారు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి గంగాదేవిపల్లికి వెళ్తుండగా.. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కోట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన జగదీష్, న్యాల నవీన్‌ల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment