
కలకోటి సుమన్ మృతదేహం, గద్దల వినోద్ మృతదేహం
ఆత్మకూరు(పరకాల): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన దామెర మండలం ఒగ్లాపూర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... దుగ్గొండి మండలం లక్ష్మిపురంకు చెందిన గద్దల వినోద్(25), మంద శ్యామ్‌సుందర్, సింగారపు ప్రణయ్, ఆత్మకూరు మండలం పెంచికలపేటకు చెందిన డ్రైవర్ కలకోటి సుమన్(21) పెంచికలపేటలో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వరంగల్‌కు కారులో వెళ్తున్నాడు.
కారును ఒగ్లాపూర్‌లోని పవర్‌గ్రిడ్ సమీపంలో ఎదురుగా ములుగు వైపు వెళుతున్న లారీ ఢీకొట్టడంతో కారు డ్రైవర్ సుమన్, గద్దల వినోద్‌లు అక్కడికక్కడే మృతిచెందగా మంద శ్యామ్‌సుందర్‌కు తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్‌కు తరలించారు. అలాగే సింగారపు ప్రణయ్‌కు గాయాలు కాగా స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. గద్దల వినోద్ స్వేరోస్ శిక్షణా కేంద్రంలో పనిచేస్తున్నాడు. సుమన్, శ్యామ్‌సుందర్ మృతి పలువురిని కలచివేసింది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఓనర్ ఇంటి ముందు ఆందోళన..
పెంచికలపేటకు చెందిన కారుడ్రైవర్ కలకోటి సుమన్ మృతదేహంతో పెంచికలపేటకు చెందిన కారు యజమాని పసుల రాజేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రాజేష్ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. కారు యజమానిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment