
చండీగఢ్: పంజాబ్‌లోని లూధియానాలో బాలీవుడ్ సినిమా రేంజ్‌ని తలపించేలా భారీ దోపిడి జరిగింది. గిల్ రోడ్ ఏరియాలో గల ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ గోల్డ్ లోన్ సంస్థలోకి ఆయుధాలు పట్టుకుని ముసుగులు ధరించిన దొంగలు, సిబ్బందిని బెదిరించి రూ.12కోట్లు విలువ చేసే బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దొంగతనానికి వచ్చిన ఐదుగురిలో ఒకరు కారులోనే ఉండగా, మిగిలిన నలుగురు గోల్డ్ లోన్ సంస్థలోకి ప్రవేశించి సిబ్బందిని తాళ్లతో బంధించి.. లాకర్ల తాళాలు తీసుకొని అందులోని 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ఈ తతంగం మొత్తం కేవలం 10 నిమిషాల్లోనే జరిగిపోయింది. దొంగతనానికి వచ్చిన వారందరూ ఒకే రకమైన దుస్తులను ధరించినట్లు సీసీటీవీ పుటేజీ ద్వారా తెలుస్తోంది. దొంగతనం జరిగిన సమయంలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. (చదవండి: అర్ధరాత్రి శబ్ధాలు భరించలేకున్నా: హరీష్ శంకర్)
Comments
Please login to add a commentAdd a comment