రక్షణ గోడకు, బస్సుకు మధ్యలో ఇరుక్కు పోయిన కారు
వైఎస్సార్ జిల్లా: గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు, మరికొంతమందికి స్వల్పగాయాలు అయ్యాయి. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సు రాయచోటి డిపోకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సు రాయచోటి నుంచి కడపకు వెళ్తోంది. బోల్తా పడిన బస్సుకు, రహదారి పక్కనున్న గోడకు మధ్య ఓ కారుకు కూడా ప్రమాదంలో ఇరుక్కుపోయింది. అయితే అదృష్టవాత్తూ అందులో ఉన్నవారికి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment