
సాక్షి, గణపురం : వరికోత మిషన్ కింద పడి మహిళా రైతు మృతిచెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మరావుపేట గ్రామానికి చెందిన చిన్నపాక సమ్మక్క(50) అదే గ్రామానికి చెందిన రైతు పోశాల రాజయ్య పొలంలోకి కూలీ పనులకు వెళ్లింది. వరికోత మిషన్ వరిని కోస్తూ వెనుక వైపు వెళ్లడంతో వెనుక పనిచేస్తున్న సమ్మక్కపై నుంచి మిషన్ వెళ్లింది. దీంతో సమ్మక్క అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణపురం ఎస్సై గోవర్ధన్ తెలిపారు. అధికారులు స్పందించి మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment