
ఘటన జరిగిన ప్రాంతం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసేందుకు వెళుతున్నఓ వ్యాన్‌పై దుండగులు దాడి చేసి రూ.11 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యాన్ డ్రైవర్, సెక్యూరిటీ గార్డు మృతి చెందారు. ఈ ఘటన నార్త్ ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు మొహం గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్ ధరించారని, ఆ వ్యాన్‌లో దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితమే ఇలాంటి ఘటనే అదే ప్రాంతంలో జరిగింది. అయితే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో దుండగుల దోపిడీ విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment