విద్యార్థినితో ఆటోడ్రైవర్‌ అసభ్య ప్రవర్తన | Auto Driver Abuses Girl Student In Rangareddy | Sakshi
Sakshi News home page

విద్యార్థినితో ఆటోడ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

Published Fri, Sep 13 2019 8:29 AM | Last Updated on Fri, Sep 13 2019 12:29 PM

Auto Driver Abuses Girl Student In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి : ఆటోలో ఎక్కిన విద్యార్థినితో ఓ ఆటోడ్రైవర్‌ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్‌లో గురువారం చోటుచేసుకుంది. ఆమన్‌గల్‌కు చెందిన ఓ 10వ తరగతి విద్యార్థిని గురువారం ఓ ఆటో ఎక్కింది. కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఆటోడ్రైవర్‌ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని ఆటోలోనుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన స్థానికులు ఆటోడ్రైవర్‌తో పాటు అతనితో ఉన్న మరో యువకుడ్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన విద్యార్థినిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement