మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం | Avanthi Srinivas Condolence To Fire Accident In Tagarapuvalasa Market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Published Fri, Jun 14 2019 7:44 AM | Last Updated on Fri, Jun 14 2019 7:45 AM

Avanthi Srinivas Condolence To Fire Accident In Tagarapuvalasa Market - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తగరపువలస మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు విపరీతంగా చెలరేగడంతో దుకాణ సముదాయాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. దుకాణాలు బూడిదకావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ, కారం, కిరాణా, కాయగూరల్లాంటి 60 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో రూ.50లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

తగరపు వలసలో దుకాణ సముదాయాల అగ్నిప్రమాదం పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అత్యవసర సహాయంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement