
నర్ర ప్రవీణ్
నర్సాపూర్‌రూరల్ మెదక్ : గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ మండలంలోని సీతారాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్ర లక్ష్మయ్య కుమారుడు నర్ర ప్రవీణ్(14) ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు స్నానం చేస్తుడంగా అకస్మాత్తుగా కిందకు పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రవీణ్ పక్క గ్రామమైన రుస్తుంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రవీణ్ మృతి విషయం తెలసుకొని తోటి విద్యార్థులతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు ఆయన ఆత్మకు శాంతి చేకురాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లి సుజాత, తండ్రి లక్ష్మయ్య, చెల్లెళ్లు శిల్ప, మానసల రోదనలు అందరిని కదిలించాయి.
Comments
Please login to add a commentAdd a comment