ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు | Bus And Lorry Accident Cleaner Died | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు : క్లీనర్‌ మృతి

Published Sun, May 6 2018 5:52 AM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Bus And Lorry Accident Cleaner Died - Sakshi

ధ్వంసమైన బస్సు ముందుభాగం

గుంటూరు, పిడుగురాళ్లటౌన్‌: అతి వేగంగా వస్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో లారీ క్లీనర్‌ మృతి చెందిన సంఘటన పట్టణంలోని సూర్యాసెమ్‌ సమీపంలో శనివారం తెల్లవారు జామున 3 గంటలకు జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. మాచర్ల–రేపల్లె నాపరాయి లోడుకు క్లీనర్‌గా పనిచేస్తున్న గడగోడు అమరలింగాచారి(23) టైరుకు పంచర్‌ కావడంతో బండిని పక్కన నిలిపి పంచర్‌ వేస్తున్నాడు. ఇదే క్రమంలో కందుకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో అమరలింగాచారి కాళ్ల మీదుగా లారీ వెళ్లడంతో తీవ్ర గాయలయ్యాయి.

బస్సు, లారీని ఢీకొనగా వెనుకగా వస్తున్న కోళ్ల లారీ బస్సును ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన తెలుసుకున్న 108 వాహనం వచ్చి క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అమరలింగాచారి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని గుంటూరుకు తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతున్న అమరలింగాచారి మృతి చెందాడు. క్షతగాత్రులు ప్రథమ చికిత్స అనంతరం వారి స్వగ్రామాలకు వెళ్లారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement