
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
సాక్షి, అమరావతి : రామవరప్పాడులో దారుణం చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు... రామవరప్పాడుకు చెందిన గొట్టిపాటి నాగ మురళీకృష్ణ ట్రాన్సుపోర్టు కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో కలిసి గోలి కృష్ణయ్య వీధిలో నివాసం ఉంటున్నాడు. కాగా ఈ దంపతులకు సంతానం లేదు. దానికితోడు మురళీకృష్ణ భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె మరణించింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి పేరుతో సూసైట్ నోట్ లభించింది. కాగా సమాచారం అందుకున్న పటమట ఏసీపీ అంకినీడు ప్రసాద్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.