తమిళనాడు, తిరువొత్తియూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో కుళ్లిన స్థితిలో లభించిన వృద్ధ దంపతుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వడపళనిలో సంచలనం కలిగించింది. చెన్నై వడపళణి భజన ఆలయ వీధికి చెందిన ముహ్మద్ యూసఫ్ (80). అతని భార్య విజయ (65). వీరు తమ కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఈ క్ర మంలో వారు ఉంటున్న ఇంటి తలుపు రెండు రో జులుగా తాళం వేయబడి ఉంది. దీంతో దంపతులు బయటి ఊర్లకు వెళ్లి ఉంటారని ఇరుగుపొరుగు భావించారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన వెలువడింది. దీనిపై సందేహం రావడంతో స్థానికులు అశోక్‌నగర్ పోలీసు స్టేషన్‌కు సమాచారం తెలిపారు. అక్కడికి వచ్చిన పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో ముహ్మద్ యూసఫ్, అతని భార్య విజయ మృతదేహాలు లభ్యమయ్యా యి. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం చెన్నై కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment