
అరెస్టయిన నిషా, విజయ్‌కుమార్
దొడ్డబళ్లాపురం : డ్రాప్ ఇచ్చే సాకుతో దోపిడీలకి పాల్పడుతున్న భార్యా, భర్తలను కలబుర్గి స్టేషన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. నిషా, విజయ్‌కుమార్ దంపతులు బస్టాపుల్లో నిల్చున్న మహిళలు, పురుషులకు డ్రాప్ ఇచ్చే సాకుతో ఎక్కించుకుని మాయమాటలు చెప్పి అనుకున్న చోటుకి తీసికెళ్లి భర్త విజయ్‌కుమార్‌తో కలిసి దోపిడీకి పాల్పడేది. వీరి బాధితుల్లో ఒకరైన సుష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment