draw issue
-
విజేతను చూడలేం..రిజర్వ్ డే కలుపుకున్నా కష్టమే!
ఈ వానను ఆపలేం. ఒక విజేతను చూడలేం. ఫైనల్ ఆడుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ఇక ప్రపంచ టెస్టు చాంపియన్లే! ఒక రోజే ఆట మిగిలున్నా... ఇంకో రోజు (రిజర్వ్ డే) కలుపుకున్నా... మొత్తం 196 ఓవర్లు పూర్తిగా వేసినా... మిగతా మూడు ఇన్నింగ్స్‌లు పూర్తి అయ్యే అవకాశాలు తక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ‘డ్రా’ తప్ప ఇంకో ఫలితం వచ్చేలా కనిపించడంలేదు. సౌతాంప్టన్: ఒక జట్టు ఓడే పరిస్థితి లేదు. మరో జట్టు గెలిచేందుకు అవకాశం కనిపించడంలేదు. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఫలితం వచ్చేలా లేదు. ఎందుకంటే నాలుగు రోజుల ఆటలో రెండు రోజుల్ని పూర్తిగా వర్షం తుడిచేసింది. ఇరు జట్లలో ఒక జట్టయితే ఇంకా తొలి ఇన్నింగ్స్నే పూర్తిగా ఆడలేదు. రెండేళ్లుగా ఉత్సాహంగా 9 జట్ల మధ్య జరిగిన డబ్ల్యూటీసీ చివరకు వాన చేతిలో ఓడేలా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ఈ ఫైనల్‌కు తొలుత వర్షమే ‘వెల్కమ్’ చెప్పింది. తొలిరోజు ఆటకు ‘నో’అంది. రెండో రోజు ఆట మొదలైనా... చాలాసేపు వెలుతురు కమ్మేసింది. ఎట్టకేలకు మూడో రోజు బంతికి, బ్యాట్‌కు సమాన అవకాశం వచ్చింది. మొత్తానికి ఆట రక్తికట్టించింది. నాలుగో రోజుపై ఆశలు రేకెత్తించింది. తీరా సోమవారం పొద్దుపొడిచేసరికి సూరీడుని పక్కకు తప్పించిన వాన... చినుకులతో మైదానాన్ని తడిపేసింది. ఇక ఆటగాళ్లు ఆడాల్సిందిపోయి... ప్రేక్షకుల్లా డ్రెస్సింగ్ రూమ్ నుంచే వానజల్లును తిలకించారు. ఇక అంపైర్లు చేసేందుకు ఏమీ లేక నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు గంటల పాటు వేచిచూసిన ఫీల్డు అంపైర్లు వర్షం తెరిపినివ్వకపోవడంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు. వాన ఆగదా... ఆట చూడమా... అంటూ అప్పటిదాకా గొడుగులు పట్టుకొని నిరీక్షించిన ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు. ఇక్కడా నిర్వహించేది! అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వాకంపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడమేంటని దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్రంగా ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆటగాడే ఇలాంటి వ్యాఖ్య చేయడం గమనార్హం. మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ‘నాకు చాలా బాధనిపిస్తుంది. అత్యంత ప్రాధాన్యమున్న ఫైనల్స్‌ను ఇంగ్లండ్‌లాంటి వేదికలపై నిర్వహించడం ఎంతమాత్రం సమంజసం కాదు. యూఏఈలాంటి వేదికను ఎంచుకుని వుంటే బాగుండేది’ అని అన్నాడు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. -
‘డ్రా’ అయితే సంయుక్త విజేతలే
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్ (డబ్ల్యూటీసీ) విజేతను తేల్చే క్రమంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావించింది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలనేమీ లేదని, సాధారణ టెస్టుల తరహాలో మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ఇరు జట్లను ప్రకటించడమే సరైందని తేల్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 సౌతాంప్టన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు సంబంధించి నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ప్రైజ్‌మనీ ఎంతనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ టెస్టు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన విశేషాలు చూస్తే... మ్యాచ్ తేదీలు: జూన్ 18 నుంచి 22 వరకు వేదిక: సౌతాంప్టన్‌లోని ఏజియస్ బౌల్ మైదానం ఉపయోగించే బంతి: భారత్‌లో సాధారణంగా టెస్టు మ్యాచ్‌లను ఎస్జీ బంతులతో, న్యూజిలాండ్‌లో కూకాబుర్రా బంతులతో ఆడతారు. వేదిక మాత్రమే కాకుండా బంతులు ఉపయోగించడంలో కూడా ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం ఉండరాదని ఐసీసీ భావించింది. అందుకే ఫైనల్ కోసం డ్యూక్స్ బంతులను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వాడే డ్యూక్స్ బంతులు సీమ్ ఎక్కువగా ఉండి బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు: మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’గా ముగిస్తే భారత్, న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడు ఈ నిబంధన ఉన్నా, ఇప్పుడు ఫైనల్‌కు ముందు ఐసీసీ దీనిని మళ్లీ పేర్కొంది. రిజర్వ్ డే ఉందా: ఉంది, జూన్ 23ను రిజర్వ్ డే ఉంచారు. అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం అని ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను ఆరో రోజుకు పొడిగిస్తారా: ఈ విషయంలోనే ఐసీసీ ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చింది. ‘రిజర్వ్ డే’ అనేది ప్రత్యామ్నాయ ఏర్పాటు మాత్రమే. అన్ని టెస్టుల్లాగే ఈ మ్యాచ్ కూడా ఐదు రోజులు పూర్తిగా జరిగి ఎవరో ఒకరు గెలవని పక్షంలో ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు తప్ప ఆరో రోజుకు పొడిగించి ఫలితం కోసం ప్రయత్నించరు. కేవలం వర్షం తదితర వాతావరణ సమస్యల కారణంగా ఐదు రోజుల్లో సమయం వృథా అయితే మాత్రమే దానిని పూడ్చేందుకు రిజర్వ్ డేలో సమయాన్ని వాడుకుంటారు. రిజర్వ్ డే ఎలా ఉంటుంది: ఆరో రోజు అవసరం పడితే గరిష్టంగా ఐదున్నర గంటల (330 నిమిషాలు) లేదా 83 ఓవర్లు ఆడిస్తారు. దీనికి చివరి గంట అదనం. వర్షం కారణంగా కొంతసేపు అంతరాయం కలిగినా... అదే రోజు ఆటను పొడిగించి దానిని సరిచేస్తూ వస్తే ‘రిజర్వ్ డే’ను వాడరు. దాదాపు రోజంతా నష్టపోతే మాత్రమే ఆరో రోజు ఆడించే అంశంపై రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఐదో రోజు చివరి గంటలో మాత్రం ఆరో రోజు ఆడించడం గురించి ప్రకటిస్తారు. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఇరు జట్లనూ రిఫరీ సమాచారం అందిస్తూ ఉంటారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఆడిస్తారా: ఇటీవల ఐసీసీ కొన్ని కొత్త నిబంధనలను టెస్టుల్లోకి తెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్‌లో కూడా వాటిని వాడారు. దీని ప్రకారం షార్ట్ రన్లను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లే ముందు బ్యాట్స్‌మన్ షాట్‌కు ప్రయత్నించాడా అనే అంపైర్‌ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్బీల కోసం రివ్యూలో ఉపయోగించే ‘వికెట్ జోన్’ ఎత్తును కూడా పెంచారు. -
WTC Final: అవసరమైతే ‘ఆరో రోజు’...
దుబాయ్: ఐదు రోజులు సాగే ఒక పూర్తి టెస్టు మ్యాచ్‌లో కనీసం 30 గంటల ఆట సాగాలి లేదా 450 ఓవర్లు పడాలి. ఇంత జరిగాక కూడా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఫలితం రాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే ఎలా? విజేత ఎవరు? ఇలాంటి సందేహం సాధారణ అభిమానికి వస్తే తప్పు లేదు. కానీ మ్యాచ్ నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వద్దనే దీనిపై సమాచారం లేదు. జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా ‘ఫైనల్’ నిబంధనల విషయంలో ఐసీసీకి ఇంకా స్పష్టత రాలేదు. ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే ఎలా అనేదానిపై ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. మొదటిసారి డబ్ల్యూటీసీ ప్రకటించిన సమయంలో ఇలాంటి పలు సందేహాలకు సమాధానమిచ్చిన ఐసీసీ... మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఐసీసీ వెబ్సైట్ నుంచి ఇవన్నీ తొలగించారు. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు అంటే ఏమాత్రం బాగుండదని, సాధ్యమైనంత వరకు ఫలితం కోసం ప్రయత్నించాలని కొన్ని సూచనలు వచ్చాయి. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ ఉంచాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీని ప్రకారం ఐదు రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే ఆరో రోజు కూడా టెస్టు ఆడించాలనేది ఒక ఆలోచన. అయితే గంటల లెక్కను చూస్తే స్లో ఓవర్ రేట్ సమస్య రావచ్చు కాబట్టి 450 ఓవర్లకంటే తక్కువ పడితే రిజర్వ్ డేను కొనసాగించాలనేది మరో ఆలోచన. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు అసలు రాబోయే రోజుల్లో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కొనసాగుతుందా అనే అంశంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. అనుకున్న స్థాయిలో డబ్ల్యూటీసీ విజయవంతం కాలేదని, ఫార్మాట్, పాయింట్ల కేటాయింపు విధానంపై బాగా విమర్శలు వచ్చాయని పలువురు సభ్యులు భావిస్తున్నారు. పైగా ఏడాదిపాటు కరోనా కారణంగా షెడ్యూల్ మొత్తం దెబ్బతింది. దాంతో దీనిపై జూన్ 1న జరిగే ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
వీళ్ళు లిఫ్ట్ఇస్తే అంతే సంగతులు..
దొడ్డబళ్లాపురం : డ్రాప్ ఇచ్చే సాకుతో దోపిడీలకి పాల్పడుతున్న భార్యా, భర్తలను కలబుర్గి స్టేషన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. నిషా, విజయ్‌కుమార్ దంపతులు బస్టాపుల్లో నిల్చున్న మహిళలు, పురుషులకు డ్రాప్ ఇచ్చే సాకుతో ఎక్కించుకుని మాయమాటలు చెప్పి అనుకున్న చోటుకి తీసికెళ్లి భర్త విజయ్‌కుమార్‌తో కలిసి దోపిడీకి పాల్పడేది. వీరి బాధితుల్లో ఒకరైన సుష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. -
లాతరీలో.. అన్నీ మోషాలే..
మద్యం షాపుల లాటరీ మాయాజాలం l సిండికేట్లతో అధికారుల లాలూచీ l అమలాపురంలో నాలుగు షాపుల తీరు గందరగోళం సీసీ కెమెరాలు... ఎంట్రీ పాస్‌లు... గుర్తింపు కార్డులు... టోకెన్లు... నఖశిఖ పర్యంతం తనిఖీలు... పారదర్శకతకు అద్దం పట్టేలా.. సవాలక్ష నిబంధనల నడుమ జిల్లాలో మద్యం షాపులకు నిర్వహించిన లాటరీ విధానం వివాదా స్పదమైంది. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు... కోర్టుల్లో కేసుల వరకూ దారి తీస్తోంది. అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) : కాకినాడలో గత నెల 31న మద్యం షాపుల కేటాయింపునకు నిర్వహించిన ఈ లాటరీ విధానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని లాటరీలో అడ్డగోలు చర్యల వల్ల షాపులు కోల్పోయిన దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు, బడా సిండికేట్లకు అధికారులు తెరచాటు సహకారం అందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. అమలాపురంలో నాలుగు షాపులకు సంబంధించిన లాటరీల్లో కేటాయింపులు వివాదాస్పదం కావడంతో బాధిత దరఖాస్తుదారుల్లో కొందరు జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. మరికొందరు ఎక్సైజ్ అధికారుల చేసిన తప్పిదాలపై కోర్టులను ఆశ్రయించారు. బినామీల రంగప్రవేశం అమలాపురంలో నాలుగు షాపుల కేటాయింపులపై చెలరేగిన దుమారంతో జిల్లాలో మి గిలిన ప్రాంతాల్లో కూడా లాటరీ లోపాలు, అధికారుల తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. అమలాపురంలో 190, 191, 192, 193 షాపుల కేటాయింపు వివాదా స్పదం అయిన సంగతి తెలిసిందే. ఒక షాపులో మొదటి దరఖాస్తుదారుడికి లాటరీలో వచ్చినప్పటికీ సంబంధిత సిండికేటర్ దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని అధికారుల ముందు నిర్ణీత సమయంలో హాజరు పరచలేకపోయారు. మరో షాపునకు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని హాజరుపరచి అతనే అసలు వ్యక్తిగా నమ్మించి అతడితో సంతకం పోర్జరీ చేయించారు. 193 షాపునకు ఒకటో దరఖాస్తుదారుడు కాకుండా మరో వ్యక్తి (బినామీ) డ్రాలో పాల్గొన్నాడు. దరఖాస్తులో ఉన్న వ్యక్తి సంతకాన్ని అతడే చేశాడు. 193 షాపులో రెండో దరఖాస్తుదారుడు జవ్వాది వెంకట కృష్ణ నాగేశ్వరరావు ఈ తప్పిదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. 192 షాపు వ్యవహారం కూడా ఇలాంటి వివాదంపైనే కోర్టు వరకూ చేరింది. పాటించని నిబంధనలు.. లాటరీ డ్రా నిర్వహిస్తున్నప్పుడు సంబంధిత షాపు దరఖాస్తుదారుడు విధిగా హాజరై ఉండాలి. ఈ నిబంధనను అధికారులు కచ్చితంగా పాటించి ఉంటే లేదా ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. లాటరీ డ్రాలో పాల్గొనే ప్రతి దరఖాస్తుదారుడికి ఫోటో గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. దరఖాస్తుదారుడికి బదులు మరో వ్యక్తి డ్రాలో పాల్గొని ఫోర్జరీ సంతకం చేయడంపై ఎక్సైజ్ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపుల నిర్వహణలో ఏళ్ల తరబడి బలంగా పాతుకుపోయిన సిండికేటర్లు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఉన్న సంబంధాలతోనే ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఆ రోజు లాటరీ డ్రా సమయంలో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తే అక్రమాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. లాటరీ డ్రాకు ఎక్సైజ్ శాఖ విధించిన నిబంధనలను కచ్చితంగా అనుసరించి తిరిగి డ్రాలు నిర్వహిస్తే ఆ షాపులు తమకే దక్కుతాయని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు.