బాలిక మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై గోపాల్
అనుమసముద్రంపేట: తల్లి మందలించిందని మనస్తాపం చెంది కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొనుగోడు దళితకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై గోపాల్ కథనం మేరకు.. గ్రామంలోని కప్పల చెంచయ్య కుమార్తె జానకి (14) ఆత్మకూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం చదవలేనని బాలిక ఇంటికి వచ్చింది. ఈక్రమంలో తల్లి బలవంతం చేయడంతో జానకి రోజూ ఆత్మకూరుకు వెళ్లి బంధువుల ఇంట్లో కూర్చుని సాయంత్రం ఇంటికి వచ్చేది. ఈ విషయం తల్లికి తెలియడంతో గురువారం సాయంత్రం కుమార్తెను మందలించింది. దీంతో ఆ బాలిక మరుగుదొడ్డికి వెళ్లి చున్నీతో ఉరేసుకుంది. కుమార్తె బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూశారు. జానకిని కిందకు దించి వెంటనే ప్రైవేట్ వాహనంలో ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. సమాచారం అందుకున్న ఏఎస్‌పేట ఎస్సై ఆస్పత్రికి వెళ్లి బాలిక వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment