శివ, పవిత్ర మృతదేహాలు
సీతారామపురం: క్షణికావేశంలో చేసిన తప్పు నేపథ్యంలో భార్యాభర్తలు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని పోకలవారిపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ముత్తోలినగర్‌కు చెందిన గొల్లపల్లి శివ (26)కు పోకలవారిపల్లికి చెందిన గొల్లపల్లి పవిత్ర (24)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ ఏడాది మార్చిలో శివ తన మరదలిని ఇంటర్మీడియట్ పరీక్షలకు బైక్‌లో తీసుకెళ్తూ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయడంతో రెండు నెలలుగా జైల్లో ఉన్నాడు. శివ ఇటీవల కండీషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఈ కేసు విషయంలో తన అత్తింటి బంధువులతో రాజీ చేసుకోవాలని ప్రయతించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. సోమవారం రాత్రి పోకలవారిపల్లిలో అత్తంటి ముందు భార్యాభర్తలిద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వీరిని కుటుంబ సభ్యులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఉదయగిరికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా ఇద్దరూ మృతి చెందారు. వీరి మృతదేహాలకు ఉదయగిరిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment