ముళబాగిలు: ప్రియుడి మోజులో పడి తన కన్న కూతురినే కడతేర్చిన ఓ కసాయి తల్లి ఉదంతం తాలూకాలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని నాగవార గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోలారు నగరంలోని కనకనపాళ్యకు చెందిన సుబ్బు లోకేష్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం తన భార్య నిఖిత, కూతురు కుముద(3) కనిపించడం లేదని, అనిల్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ కోలారు నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఉండగా కోలారులోని కనకన పాళ్యలో ఉంటున్న రంగప్ప కుమారుడు అనిల్‌తో నిఖితకు అక్రమ సంబంధం ఏర్పడింది.
ఈక్రమంలో నిఖిత తన కుమార్తె కుముదను తీసుకుని అనిల్‌తో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. తల్లీ, కూతురు అదృశ్యంపై పోలీసులు కేసు విచారణ చేపట్టి అనిల్, నిఖితలు బెంగుళూరులోని హలసూరులో నివాసం ఉంటున్నట్లు తెలుసుకుని బెంగుళూరుకు వెళ్లి వారిని తీసుకు వచ్చారు. విచారణలో తాము కుముదను హత్య చేశామని, కోలారులో హత్య చేసి శవాన్ని ఆంధ్ర సరిహద్దు సమీపంలోని ముళబాగిలు తాలూకా నాగవార గ్రామం వద్ద ఉన్న పాడుబావిలో పారవేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు వారిని వెంటబెట్టుకుని బావి వద్దకు తీసుకుని వెళ్లి చూడగా బాలిక శవం కుళ్లిన స్థితిలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment