![Doctors Negligence on Pregnant Women in Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/24/balintha.jpg.webp?itok=fkJ96Umd)
ఆందోళన చేస్తున్న కుటుంబీకులు ( బాలింత కవిత )
కర్ణాటక, రాయచూరు రూరల్: కొప్పళ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనూహ్య సంఘటన జరిగింది. ఓ బాలింత కుటుంబ నియంత్రణ చికిత్స కోసం వస్తే వైద్యం చేశారు. అయితే చనిపోయిందని చెప్పి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లమన్నారు. బంధువులు విలపిస్తూ శవాన్ని అంబులెన్సులోకి తరలిస్తుండగా బాలింత కళ్లు తెరచి చూసింది.
ఏం జరిగిందంటే.. కొప్పళకు చెందిన కుంభార మంజునాథ్ బాగల్‌కోట జిల్లా గోవనకు చెందిన కవిత(28)తో వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉండగా రెండురోజుల క్రితం మగ పిల్లాడు పుట్టాడు. దీంతో కుటుంబ నియంత్రణ అపరేషన్ కోసం కేఎన్ ఆస్పత్రిలో చేర్చారు. అధిక రక్తస్రావం వల్ల బలహీనపడిందని చికిత్స చేయసాగారు. మంగళవారం ఉదయం ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించి రూ. లక్ష ఫీజుల్ని కట్టించుకున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లండని చెప్పారు. కుటుంబసభ్యులు కవిత దేహాన్ని స్ట్రెచర్ ద్వారా అంబులెన్సు వద్దకు తరలిస్తుండగా ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. చివరకు బతికే ఉందని తెలిసి సంతోషించారు. బతికి ఉన్న మనిíషిని చనిపోయిందని చెప్పిన వైద్యులపై మండిపడుతూ ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి చూట్టు పోలీసుల బందోబస్తును ఇవ్వడం జరిగింది. ఆమెకు అక్కడే చికిత్సనందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment