పోకిరీని తీసుకెళ్తున్న పోలీసులు
అనంతపురం , హిందూపురం అర్బన్: మద్యం మత్తులో ఉండి రోడ్డుపై వెళ్తున్న విద్యార్థులు, ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పోకిరీకి ప్రజలు దేహశుద్ధి చేశారు. కర్ణాటకకు చెందిన రోషన్ అనే వ్యక్తి హిందూపురంలోని ఎగ్జిబిషన్‌లో పనిచేస్తున్నాడు. ఉదయం పూట తప్పతాగి ఇలా రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వెనుక నుంచి వెళ్లి తలపై మొట్టికాయ వేయ డం, గిల్లడం వంటివి చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం బస్టాండువద్ద ఇలా చేస్తుండటంతో అక్కడివారు గట్టిగా మందలించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం సద్భావనసర్కిల్ వద్ద వెళ్తున్న విద్యార్థులను కొట్టి గిల్లడంతో వారు గట్టిగా కేకలు పెట్టారు. స్థానికులు వెంటనే రోషన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment