షమాదిన్ (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : ‘నాన్నా.. జీవితంపై విరక్తి చెందాను.. బతకాలని లేదు.. ప్రేమంటే ఏంటో అంతా అయో మయంగా ఉంది.. ఓదార్చేవారు కరువయ్యారు.. అమాయకురాలిని.. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా’అంటూ ఒకవైపు తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఇంజనీరింగ్ విద్యార్థిని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. అండమాన్ నికోబార్ రాజ ధాని పోర్ట్‌బ్లెయర్‌కు చెందిన షమాదిన్ (21) హైదరాబాద్ షేక్‌పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 4వ ఏడాది చదువుతుంది. గతేడాదిగా తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య గడుపుతోంది. శనివారం రాత్రి 9.30కి కళాశాల హాస్టల్ భవనం టెర్రస్ పైకి వెళ్లి తండ్రి మహమద్‌తో మాట్లాడుతూ జీవితంపై విరక్తి చెందాను.. తనకు బతకాలని లేదంటూ ఫోన్ విసిరేసి కిందకు దూకేసింది.
గాయాలపాలైన బాధితురాలిని సన్‌షైన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. అదేరోజు రాత్రి తండ్రి పోర్ట్‌బ్లెయర్ నుంచి బయల్దేరి నగరానికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. కూతురి శవాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కొంతకాలంగా మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు తనతో చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment