గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసు అధికారులు
ప్రకాశం, సంతమాగులూరు: సంతమాగులూరులో చిన్న గొడవ జరిగినా అది చివరకు ఎటు దారి తీస్తుందోనని స్థానికులతో పాటు పోలీసులు భయపడుతుంటారు. గతంలో హత్యలు జరిగిన నేపథ్యంలో గ్రామంలో ఇప్పటికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటారు. సంతమాగులూరులో ఓ ఇంటి స్థలం వివాదం ప్రాణాలపైకి తెచ్చింది. వివరాలు.. సంతమాగులూరులో సర్పంచ్ వర్గానికి వారి బంధువులైన మరో వర్గానికి చిన్న రహదారి వద్ద నవంబర్‌లో పెద్ద ఘర్షణ జరిగింది సర్పంచి వర్గానికి చెందిన ఐదుగురు ఆస్పత్రిపాలయ్యారు. మళ్లీ ప్రశాంతంగా ఉందనుకున్న సంతమాగులూరులో గురువారం ఉదయం సర్పంచ్ వీరనారాయణ తండ్రి వీరయ్య వర్గం దాడిలో మరో వర్గానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీతో పాటు సీఐ హైమారావు, ఎస్‌ఐ నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించారు. తన్నీరు వెంకట్రావు, తిరుపతయ్య, మురళి, పోలాంజీలు పొలం వెళ్లి వస్తుండగా కాపుగాసిన సర్పంచి వర్గానికి చెందిన 12 మంది కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
పరారీలో నిందితులు
దాడికి ప్రయత్నించిన సర్పంచ్ వర్గం 12 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడికి దిగిన ప్రతి ఒక్కరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని సీఐ హైమారావు హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగటంపై గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు వర్గాలపై రౌడీషీట్ ఓపెన్ చేసి బల్లికురవ మండలం వేమవరం వంటి ఘటన పునరావృతం కాకుండా వారిని ఊరి నుంచి వెళ్లగొడతామని సీఐ పేర్కొంటున్నారు. తిరుపతయ్య కుమారుడు రవీంద్ర ఫిర్యాదు మేరుకు 12 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎసఐ నాగరాజు తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment